పీఆర్సీ ప్రకటించి, సీపీఎస్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2023-02-16T00:01:02+05:30 IST
పీఆర్‌సీ ప్రకటిం చి సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాం డ్ చేస్తూ ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఏలూరు రూరల్ / జంగారెడ్డిగూడెం టౌన్, ఫిబ్రవరి 15: పీఆర్‌సీ ప్రకటిం చి సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాం డ్ చేస్తూ ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బీఎ సాల్మన్‌రాజు, జిల్లా అధ్యక్షుడు బి.రెడ్డిదొర మాట్లాడారు. జగన్ పాదయాత్ర సమయంలో అధి కారంలోకి వస్తే వారంలో సీపీఎస్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేటికీ హామీ నెరవేర్చలేదన్నారు. తక్షణం 12వ వేతన సంఘాన్ని నియమించాలని, పెండింగ్ డీఏలు మంజూరు చేసి ప్రతి నెలా 1న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రంగావళి, కె భానుమూర్తి, ఎపీటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యా లయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి యూవీఎన్ నరసింహరాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐవి రత్నం, సుబ్బారావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.