Share News

ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమ బాట

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:05 AM

ప్రజా రవాణా సంస్థ సిబ్బంది ఉద్యమబాట పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం వేతన సవరణ (2017) బకాయిలు ఏడేళ్లు అయినా ఇవ్వడం లేదు. ఓటీలు, అలవెన్సులు, జీతాలతో పాటు చెల్లించడం లేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి తొలి అడుగుగా ప్రజా రవాణా సంస్థ ఎన్‌ఎంయూ ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ వద్ద బుధవారం రెండో రోజూ ధర్నా కొనసాగించారు.

ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమ బాట
ధర్నా నిర్వహిస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు

తాడోపేడో తేల్చుకుంటామన్న ఎన్‌ఎంయూ నాయకులు

ఏలూరు రూరల్‌, డిసెంబరు 13: ప్రజా రవాణా సంస్థ సిబ్బంది ఉద్యమబాట పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం వేతన సవరణ (2017) బకాయిలు ఏడేళ్లు అయినా ఇవ్వడం లేదు. ఓటీలు, అలవెన్సులు, జీతాలతో పాటు చెల్లించడం లేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి తొలి అడుగుగా ప్రజా రవాణా సంస్థ ఎన్‌ఎంయూ ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ వద్ద బుధవారం రెండో రోజూ ధర్నా కొనసాగించారు. ఈనెల 4న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్‌ కమిటీ తీర్మానం మేరకు ఎన్‌ఎంయూ అన్ని డిపోలు, యూనిట్లలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కారానికి ఉద్యమ బాట పడతామని నాయకులు హెచ్చరించారు.

డిమాండ్లు ఇవే..

ఈపీఎఫ్‌ 95, సీపీఎస్‌ ఆప్షన్‌ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. 2017 ఎరియర్స్‌ ఒకేసారి చెల్లించాలి. వీహెచ్‌ఎస్‌ సదుపాయం కల్పించాలి. అన్‌లిమిటెడ్‌గా వైద్య సహాయం అందించాలి. ఉద్యోగులకు గ్రావిటీ ఇవ్వాలి. పెండింగ్‌లోని అప్పీళ్లు తక్షణం పరిష్కరించాలి. సిక్‌, మెడికల్‌ లీవ్‌లో ఉన్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలి. 2019 సర్క్యులర్‌ వెంటనే అమలు చేయాలి.

పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలి

ఎఎస్‌ ఇంక్రిమెంట్లు, మ్యాన్లువల్‌ ఇంక్రిమెంట్లు, పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలి. గ్యారేజీలో స్పేర్‌ పార్టులు, టూల్స్‌ ఇప్పించాలి. మహిళా ఉద్యోగులకు జీవో ప్రకారం సేవలు కొనసాగించాలి. 2022 నుంచి నెలవారీ ఇన్సెంటివ్‌ ఇచ్చేలా కొనసాగించాలి. సిబ్బందిపై దాడి చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి.

– ప్రసాదరావు, జోనల్‌ అధ్యక్షుడు

అధికారుల జులుం ఆపాలి

ఉద్యోగులపై అధికారుల జులుం ఆపాలి. కేడర్‌ స్ట్రంత్‌పై ఉన్న ఉద్యో గులు ఆ యూనిట్‌లో హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ అలవెన్సులు కొనసాగించాలి. రద్దు చేసిన బస్సు సర్వీసులు పునరుద్ధరించాలి. స్పెషల్‌ డ్యూటీ చేసిన ప్పుడు బలవంతపు సెలవులు ఇవ్వకుండా ఆన్‌డ్యూటీగా పరిగణించాలి.

– శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి

Updated Date - Dec 14 , 2023 | 12:05 AM