అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-09-26T00:59:48+05:30 IST

స్పందనలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అధికారులను ఆదేశించారు.

 అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

స్పందనలో 396 అర్జీల స్వీకరణ

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 25 : స్పందనలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనకు అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, వ్యవసాయ శాఖ అధికారి వై.రామకృష్ణ, డీపీవో విశ్వనాథశ్రీనివాస్‌ ఆయా శాఖల అధికారులు మొత్తం 396 అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు అందజేసేందుకు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు రావడంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కిక్కిరి సింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తు లను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల న్నారు. ప్రతి రోజు స్పందన లాగిన్‌చూసి వాటి సంఖ్య తగ్గేలా చూడాలన్నారు.

క్షుణ్ణంగా తనిఖీలు

కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మహిళా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. కేవలం అధికారులకు అందించే ఫిర్యాదు పత్రాలను ఒక్కటే అనుమతించారు. ఇటీవల పలువురు మహిళలు కలెక్టరేట్‌కు ఫిర్యాదు అందిం చేందుకు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. అటువంటివి పునరావృతం జరుగకుండా చర్యలు చేపట్టారు.

అర్జీదారులకు పత్రాల అందజేత

స్పందనలో వివిధ సమస్యల పరిష్కారం కోసం అందిన అర్జీల్లో తమ సమస్య పరిష్కారం అయిందని పలువురు అర్జీదారులు తెలిపారు. కలెక్టరేట్‌లో స్పందనలో అర్జీదారులు దరఖాస్తు చేసినవాటికి సంబంధించి పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించిన అర్జీల్లో ప్రతి మండలం నుంచి ప్రతి సోమవారం మూడు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు : ఎస్పీ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 25 : ప్రభుత్వ పథకాల పేరుతో ఫోన్లు చేసి బ్యాంక్‌ అకౌంట్‌, ఏటీఎం కార్డు, పిన్‌ నెంబర్లు, వ్యక్తిగత వివరాలు ఎవరైనా అడిగితే చెప్పవద్దని ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో మొత్తం 45 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి కల్పించారు.

Updated Date - 2023-09-26T00:59:48+05:30 IST