మత్తు సరదా వద్దు

ABN , First Publish Date - 2023-06-26T23:48:45+05:30 IST

యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్‌తో పాటు దేశ భవిష్యత్‌ నాశనమవుతుందని ఎస్‌ఈబీ ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు అన్నారు.

మత్తు సరదా వద్దు
ప్రతిజ్ఞ చేయిస్తున్న సెబ్‌ ఏఎస్పీ సూర్యచంద్రరావు

మాదక ద్రవ్యాలు అలవాటైతే భవిష్యత్‌ నాశనం

జిల్లాలో సెబ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

ఏలూరు క్రైం / పెదపాడు, జూన్‌ 26: యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్‌తో పాటు దేశ భవిష్యత్‌ నాశనమవుతుందని ఎస్‌ఈబీ ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు అన్నారు. శ్రీ రామచంద్ర ఇంజ నీరింగ్‌ కాలేజీలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సోమ వారం నిర్వహించారు. సూర్యచంద్రరావు మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరం అని తెలిపారు. విద్యార్ధి దశలోనే క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టపడి చదివిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి జీవిత కాలం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతారన్నారు. చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు, శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.రాజేశ్వరి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు సేవించిన, కల్గి ఉన్నా చట్ట ప్రకారం కోర్టు శిక్ష విధిస్తుందని వివరించి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరిటెండెంట్‌ వి అరుణకుమారి విద్యార్థులకు డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్ధాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సెట్వెల్‌ సీఈవో మెహర్రాజ్‌, ఆశ్రం ఆసుపత్రి సైకియా ట్రిస్టు శ్రీనివాసరావు, ఎస్‌ఈబి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సుబ్బా రెడ్డి, డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జీఎస్‌కె ధనరావు, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ కుమార్‌ పాల్గొన్నారు. 1800 మంది విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞను అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు చేయించారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించా ల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని సీఐ టి.రాజేష్‌ అన్నారు. అంతర్జతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సం దర్భంగా మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జూనియర్‌ కళా శాలలో సదస్సు నిర్వహించినారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు అధ్యక్షత వహించుగా న్యాయవాదులు మాదక ద్రవ్య నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వెంక టేశ్వరరావు న్యాయవాదులు మోదేపల్లి నాగులు, పిల్లి పెద్దిరాజు, బల్లే సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:48:45+05:30 IST