కదం తొక్కిన అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2023-02-06T23:45:23+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌ వాడీలు కదంతొక్కారు. ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌ల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఏలూరులో జూట్‌మిల్లు సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు.

కదం తొక్కిన అంగన్‌వాడీలు
ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ సాబ్జి

ఫేస్‌ యాప్‌ అంటెండెన్స్‌ రద్దు చేయాలి

వేతన బకాయిలు చెల్లించండి

ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా

భీమవరం/ ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 6 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌ వాడీలు కదంతొక్కారు. ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌ల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఏలూరులో జూట్‌మిల్లు సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అటెండెన్స్‌ ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, వేతన బకాయిలు విడుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలనే డిమాండ్లతో ఆందోళన చేశారు. భీమవర్లఓ ధర్నాకు కె.జాన్సీ లక్ష్మీ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మద్దతు తెలిపి మాట్లాడుతూ సమస్యలను వినకుండా, చెప్పనివ్వకుండా నిర్బంధించడం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పనికిరాని సెల్‌ఫోన్లు ఇచ్చి వాటి చుట్టూ తిరిగేలా అంగన్‌వాడీల మీద ఒత్తిడి చేస్తోందన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ యాప్‌ల వల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు. సీఐటీయూ జిల్లా నాయకులు వాసుదేవరావు, పీవీ ప్రతాప్‌, వీవోఏల సంఘం జిల్లా నాయకులు ఎ.అజయ్‌కుమారి, వీఆర్‌ఏలు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మద్దతు తెలిపి మాట్లాడారు. డీఆర్వో కె.కృష్ణవేణి, పీడీ సుధారాణికి వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని, నెలాఖరులోపు జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తానని, ప్రమోషన్లు విషయంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రభుత్వాన్ని దింపితేనే సమస్యల పరిష్కారం

ఏలూరులో జరిగిన ఆందోళనకు అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పెర్స్‌ యూని యన్‌ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ హసీనా అధ్యక్షత వహించగా టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రభుత్వాన్ని దించితేనే సమస్యలు పరిష్కారమవు తాయని అప్పటి వరకూ పోరాటం కొనసాగిం చాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.లింగ రాజు, డీఎన్‌వీడి ప్రసాద్‌ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేతకాక అంగన్‌వాడీలను తనిఖీల పేర్లతో వేధించడం సిగ్గు చేటన్నారు. 16 కార్లు వేసుకుని అంగన్‌వాడీలను సంద ర్శిస్తున్న ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ అంగన్‌ వాడీలను అవమా నిస్తే సహించేది లేదన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పివి నర సింహారావు, కె.బ్రహ్మాజీ, సీఐటీయూ నాయ కులు సోమయ్య, రాజు, షేక్‌ సుభాషిణి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:45:25+05:30 IST