Share News

అంగన్‌వాడీలను ప్రభుత్వం మోసం చేసింది

ABN , First Publish Date - 2023-11-22T00:14:28+05:30 IST

అంగన్‌వాడీలను ప్రభుత్వం చేసిందని, జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం ఒకరోజు రిలే దీక్షలు చేపట్టారు.

అంగన్‌వాడీలను ప్రభుత్వం మోసం చేసింది
కొయ్యలగూడెం ఐసీడీఎస్‌ వద్ద అంగన్‌వాడీల రిలే దీక్ష

ఎన్నికల మందు జగన్‌ ఇచ్చిన హామీ గాలికొదిలేశారు

సమస్యలు పరిష్కరించమంటే వేధింపులు

ఐసీడీఎస్‌ల వద్ద ఒక రోజు రిలే దీక్ష

చింతలపూడి, నవంబరు 21: అంగన్‌వాడీలను ప్రభుత్వం చేసిందని, జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం ఒకరోజు రిలే దీక్షలు చేపట్టారు. చింతలపూ డి ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద రిలే దీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌వీఎస్‌.నారాయణ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే రూ.వెయ్యి అధికం గా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణలో 15 వేలకుపైగా జీతాలు ఇస్తుంటే ఇక్కడ రూ.11,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. హామీలు నెర వేర్చాలని అడిగిన అంగన్‌వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిం చారు. డిసెంబర్‌ 8 నుంచి జరిగే రాష్ట్ర అంగన్‌వాడీల సమస్యలపై జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రిలే దీక్షల్లో నత్తా వెంకటే శ్వరరావు, జానీ, ఎం.వరలక్ష్మీదేవి, కె.అనురాధ, సయ్యద్‌ జఫ్రుల్లా మద్దతు తెలిపారు. ఎన్‌.సరోజిని, టి.మాణిక్యం, కుమారి, అంజమ్మ, మరియమ్మ, ఫణివర్ధని, జి.సరళ తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు: అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని, తక్షణం సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పెదపాడు సీడీపీవో కార్యాలయం వద్ద ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ పథకానికి కేటాయించే మెనూ ఛార్జీ గిట్టుబాటు కావడం లేదని, అవుట్‌ సో ర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామన్న ప్రభుత్వం మోసం చేసిందని పలువురు ఆరోపించారు. కె.విజయలక్ష్మి, తిరుపతమ్మ, ఎం.బేబిరాణి, రంగమ్మ, త్రివేణి, కృష్ణవేణి, శ్రీకుమారి, హిమబిందు, లక్ష్మీ, తులసి పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: జీతాలు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచనలు పాటించాలని అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిం చాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్రశేషు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని టీడీపీ నాయ కులు సందర్శించి మద్దతు తెలిపారు. బొబ్బర రాజ్‌పాల్‌, సాయిల సత్యనా రాయణ మాట్లాడారు. అంగన్‌వాడీ నేతలు విమల, విజయ, లక్ష్మిదేవి, సుబ్బాయమ్మ, సునీత, శోభ అధిక సంఖ్యలో వర్కర్లు పాల్గొన్నారు.

కుక్కునూరు: ఐసీడీఎస్‌ బడ్జెట్‌ను పెంచి అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి మడివి దుర్గారావు, ఏఐటీయూసీ మండల కన్వీనర్‌ కొన్నే లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. కుక్కునూరు ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు రిలే నిరసన దీక్ష నిర్వహిం చారు. మెడికల్‌ లీవ్‌లు ఇవ్వాలని, మినీ సెంటర్‌లను మెయిన్‌ సెంటర్‌లుగా చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పధకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రాజెక్ట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వై.సాయికిరణ్‌, మధు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు నాగలక్ష్మి, ఎస్‌.లత, బి.సుజాత, సైదా, రమాదేవి పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్సర్స్‌ యూనియన్‌, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద రిలే నిరహార దీక్షలు చేపట్టారు. యూనియన్‌ నాయకులు ఎం.నాగమణి, కేవీ.రమణ మాట్లాడు తూ డిసెంబరు 8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. జగన్‌ ప్రభుత్వం అంగన్‌వాడీలను మోసం చేస్తుందన్నారు. హెల్పర్ల పదోన్నతి వయస్సును 50 ఏళ్లకు పెంచాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, అన్ని యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో టి.రాణిరత్నప్రభ, సీహెచ్‌.కొండలరావు, కె.కృపా మణి, కె.పుష్ప, కె.రామలక్ష్మి, పి.నూర్జహాన్‌, ఎం.సుధారాణి, కె.మారమ్మ, బి.అకాష్‌, పి.సీత, మల్లేశఽ్వరి అంగనవాడీలు పాల్గొన్నారు.

భీమడోలు: అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం కోసం భీమడోలు ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 170 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లింగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఐసీడీఎస్‌ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తుందన్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సుప్రీంం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరి ష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, స్వర్ణకుమారి, చల్లా మణి, సుజాత, ఝాన్సీ, రాజామణి పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ నాయకులు ఎస్‌.రాంబాబు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కుమారి అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దశల వారీగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికి ప్రభుత్వం పరిష్కార మార్గంలో పని చేయడంలేదన్నారు. డిసెంబర్‌ 8 నుంచి సమ్మెలోకి దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో నాగ వేణి, భారతి, పద్మజ, రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:14:30+05:30 IST