Share News

సమస్యలపై లేఖ

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:35 AM

ఓ సారూ.. మా గోడు వినండి.! మా సమస్యలను పరిష్కరించండి.. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మా ఆకలి కేకలు మీ చెవికి చేరలేనట్టుంది.

సమస్యలపై లేఖ
చింతలపూడి ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో పోస్ట్‌కార్డులతో అంగన్‌వాడీలు

ముఖ్యమంత్రికి అంగన్‌వాడీల ఉత్తరాలు

ఓ సారూ.. మా గోడు వినండి.! మా సమస్యలను పరిష్కరించండి.. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మా ఆకలి కేకలు మీ చెవికి చేరలేనట్టుంది. ఇప్పుడు లేఖ రాస్తున్నాం.. మా సమస్యలను తెలియజేస్తున్నాం.. ఉత్తరం చదివి, మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం... అంటూ అంగన్‌వాడీలు తమ సమస్యలను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రికి పోస్ట్‌ చేశారు.

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 28: అంగన్‌వాడీల 17వ రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. సమస్యలను పోస్ట్‌కార్డుపై రాసి సీఎం జగన్మోహన్‌రెడ్డికి పోస్ట్‌ చేశారు. జగన్మోహన్‌రెడ్డి గారు మా సమస్యలు పరిష్కరించండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి అని కోరారు. సీఐటీయూ నగర అధ్యక్షుడు బి.జగన్నాధరావు మా ట్లాడుతూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా అంగన్‌వాడీల సమస్య లు పరిష్కరించాని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అధ్యక్షులు రజినీ, దుర్గాభవాని, హైమావతి, కనకదుర్గ, మల్లిక, అరుణకుమారి తెలిపారు.

పోలవరం: అంగన్వాడీలు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి పీఎల్‌ఎస్‌ కుమారి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోస్టు ఉద్యమం కొనసాగు తుందన్నారు. అంగన్వాడీలు పద్మ, సరస్వతి, హైమవతి, కుబ్ర, జుబేద, వెంకటరమణ, సత్యవతి, విజయ తదితరులు పాల్గొన్నారు.

కుక్కునూరు: అంగన్‌వాడీలపై చిన్నచూపు ఎందుకని సీఐటీయూ మండల కార్యదర్శి వై.సాయికిరణ్‌ ప్రశ్నించారు. అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. పోస్టాఫీసు వరకు ర్యాలీగా వెళ్లారు. కుంజా నాగలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు పరసా నాగేశ్వరరావు, పరసా మంగ, కారం రాధ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: అంగన్‌వాడీ వర్కర్లు ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్‌లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం చేపడతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ జిల్లా నాయకురాలు విమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

లింగపాలెం: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరవధిక సమ్మె కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు దీక్ష విరమించేది లేదన్నారు. అంగన్‌వాడీ నాయకులు బీజేఎన్‌ కుమారి, వి.ఈశ్వరి, మండలం లోని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

చింతలపూడి: ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమం త్రికి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. జేఏసీ నాయకురాలు అంజమ్మ, సరళ, కవిత, విజయలక్ష్మి, చెన్నకేశ్వరి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి: అంగన్‌వాడీలు తమ సమస్యలను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రికి పోస్ట్‌ చేశారు. చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తు న్నామని, కష్టానికి తగిన ప్రతిఫలమే కోరుతున్నామన్నారు. సీఐటీయూ నాయకులు జె.గోపి, పి.ప్రసాద్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బేబీరాణి, కృష్ణవేణి, నిర్మల, అనంతలక్ష్మి, త్రివేణి, భార్గవి, నాగమణి, నిర్మలజ్యోతి, ఉష, సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

జీలుగుమిల్లి: అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని జగనన్న మాట తప్పారని అంగన్వాడీలు అన్నారు. 17రోజు ధీక్షలో భాగంగా సమ్మెలో హామీలు మాకొద్దు జీతాలే కావాలని నినాదాలు చేశారు. పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. సీహెచ్‌.కొండలరావు, జ్యోతి, మణి, పూర్ణావతి, మంగ, ఎస్తేరు, లక్ష్మీ, సరళ, అరుణాంబ ఉన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:35 AM