అమ్మఒడి.. రూ.259.43 కోట్లు జమ

ABN , First Publish Date - 2023-06-29T00:23:08+05:30 IST

జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత 2022–23 ఏడాదికి గాను జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు రూ.259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ లావణ్య వేణి అన్నారు.

అమ్మఒడి.. రూ.259.43 కోట్లు జమ
నమూనా చెక్కు అందజేస్తున్న జేసీ లావణ్యవేణి

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 28 : జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత 2022–23 ఏడాదికి గాను జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు రూ.259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ లావణ్య వేణి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీ లావణ్యవేణి నమూనా చెక్కును విద్యార్థులు, తల్లుల బృందానికి అందజేశారు. జడ్పీ చైర్మన్‌ గంటా పద్మశ్రీ, డీఆర్వో సత్యనారా యణమూర్తి, డీఈవో రవి సాగర్‌, ఆర్‌ ఐవో చంద్రశేఖర్‌, ప్రభాకర్‌, తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-06-29T00:23:08+05:30 IST