ఉద్యమజోరు

ABN , First Publish Date - 2023-09-20T00:41:38+05:30 IST

ఆగమంటే ఆలోచిస్తామేమో గానీ.. అడ్డుకుంటే తగ్గేదే లేదని టీడీపీ–జనసేన కూటమి నిరూపించింది. పోలీసులు లాఠీలు ఝళిపిస్తే.. తాము ఐక్యంగా పోరా డుతామని చెప్పకనే చెప్పింది. ఏ ద్వారకా తిరుమలకు చేరకుండా అడ్డుకున్నారో, అదే చిన వెంకన్న సన్నిధికి టీడీపీ–జనసేన కూటమి భారీ సంఖ్యలో పాదయాత్ర ను విజయవంతంగా పూర్తి చేసింది.

ఉద్యమజోరు
తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతల పాదయాత్ర

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఏడో రోజు ఆందోళనలు

రిలే దీక్షలు.. ఒంటి

కాళ్లపై నిరసనలు.. పోస్టుకార్డుల ఉద్యమం

జనసైనికులతో కలిసి వాడవాడలా హోరెత్తిన నినాదాలు

పాదయాత్రగా ద్వారకా తిరుమల

చిన వెంకన్న సన్నిధికి

(భీమవరం/ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఆగమంటే ఆలోచిస్తామేమో గానీ.. అడ్డుకుంటే తగ్గేదే లేదని టీడీపీ–జనసేన కూటమి నిరూపించింది. పోలీసులు లాఠీలు ఝళిపిస్తే.. తాము ఐక్యంగా పోరా డుతామని చెప్పకనే చెప్పింది. ఏ ద్వారకా తిరుమలకు చేరకుండా అడ్డుకున్నారో, అదే చిన వెంకన్న సన్నిధికి టీడీపీ–జనసేన కూటమి భారీ సంఖ్యలో పాదయాత్ర ను విజయవంతంగా పూర్తి చేసింది. వెంకన్న సన్నిధికి చేరుకుని 101 కొబ్బరి కాయలతో తమ అధినేత చంద్రబాబు విడుదలకు మొక్కులు మొక్కింది. తిరుమలంపాలెం వద్ద టీడీపీ నాయకుల పాదయా త్రపై పోలీసులు విచక్షణారహితంగా చేసిన ప్రవర్త నను సవాల్‌ చేస్తూ, యావత్‌ ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లా టీడీపీ–జనసేన నాయకులు కలిసి మంగళ వారం పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో ఒక్క పోలీస్‌ కూడా కనిపించకపోవడం గమనార్హం.

తిమ్మాపురం టూ చినవెంకన్న సన్నిధి

చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో బాబును విడుదల చేయాలని, ఈ రాక్షస పాలన అంతమొం దాలని చినవెంకన్న తోడు కావాలని వేడుకుంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు జన సైనికులతో కలిసి సుమారు మూడు వేల మంది భారీ పాదయాత్రగా శ్రీవారి క్షేత్రానికి మంగళవారం చేరుకున్నారు. ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం నుంచి ప్రారంభ మైన యాత్రలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు గన్ని వీరాంజనేయులు, కేఎస్‌ జవహర్‌, నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు ఆరిమిల్లి రాధాకృష్ణ, వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు, బూరుగుపల్లి శేషారావు, మద్దిపాటి వెంకట్రాజు, ఘంటా మురళి, అంగర రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

లాఠీలకు సవాల్‌

గడిచిన శుక్రవారం ఇదే రీతిన టీడీపీ మండల స్థాయి నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఆ సమ యంలో పాదయాత్రను అడ్డుకుంటూ నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన పోలీసు అధికారులు చేసిన వీరం గం అంతా ఇంతా కాదు. బీమడోలు ఎస్‌ఐ బూతుల వర్షం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాదని అడుగులు ముందుకు వేసిన టీడీపీ నాయకులను చెదరగొట్టే పేరుతో లాఠీలు ఝుళిపించారు. ఈ క్రమంలో మహిళలు, పురుషులు అన్న భేదం కూడా చూపని పోలీసుల వైఖరిపై ప్రజలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే తాను శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటే సహించేదే లేదని రుజువు చేస్తూ మరోసారి పాదయాత్రకు పూనుకు న్నారు. ఈ సారి ఉమ్మడి పశ్చిమలో వేలాది మంది పార్టీ శ్రేణులకు జనసైనికులు కలిసి వచ్చారు. శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్న టీడీపీ–జనసేన నాయకులు స్వామికి మొక్కి కొబ్బరికాయలు కొట్టి, తిరిగి సొంత ప్రాంతాలకు ప్రయాణమయ్యారు.

ఏడో రోజూ నిరసనలు

చంద్రబాబుపై అక్రమ కేసులు, అరెస్టులను నిరసిస్తూ ఏడో రోజు మంగళవారం కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ సెల్‌, మైనారిటీ నాయకులు దీక్షలు చేపట్టారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సంఘీభావం తెలిపారు. పితాని వెంకట్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తాడే పల్లిగూడెంలో గొర్రెల ఽశ్రీధర్‌ యువసేన ఒంటి కాళ్లపై నిరసన తెలిపింది. దీక్షలో యువత పాల్గొంది. నియోజ కవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి, జోన్‌–2 సమన్వయ కర్త రవి మద్దతు ప్రకటించారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోస్ట్‌ కార్డుల ఉద్యమం కొనసా గింది. బీసీ నాయకులు దీక్ష చేపట్టారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దొమ్మేటి సుధాకర్‌, గుబ్బల శ్రీనివాస్‌, మట్టా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో నియోజకవర్గ తెలుగు యువత మంగళవారం దీక్ష చేపట్టింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర్‌ రామ్మోహన్‌రావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. నర్సా పురంలో చేపట్టిన దీక్షకు ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు సంఘీభావం తెలిపారు.

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి జగన్‌ ప్రభుత్వం ఓర్వలేక పోతోంది. యువగళం ప్రజాగళంగా మారడం.. వారాహి యాత్రకు మంచి స్పందన ఉండటంతో ప్రతిపక్షాలను అణగకొట్టే దిశగా కుట్రలు పన్నుతోంది. ఈ ప్రయత్నాలు చేస్తున్న సైకో పాలన పోవాలని చినవెంకన్నను వేడుకున్నాం.

–పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ప్రజాకోర్టులో జగన్‌ డిపాజిట్లు కోల్పోవడం తథ్యం. చంద్రబాబు అక్రమ అరెస్టు ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా చంద్రన్న అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్నారు.

– ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్‌ బడేటి చంటి

జగన్‌ తన రాజకీయ సమాధికి తానే పునాది తీసుకున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి మచ్చలేని నాయకుడు చంద్రబాబుకు మద్దతుగా గళం విప్పుతున్నారు.

– గోపాలపురం ఇన్‌చార్జ్‌ మద్దిపాటి వెంకట్రాజు

Updated Date - 2023-09-20T00:41:38+05:30 IST