9న ఉత్తరాంధ్ర జిల్లాల యూత్‌ వర్క్‌షాప్‌

ABN , First Publish Date - 2023-03-02T00:09:32+05:30 IST

విజయనగరం అమర్‌భవన్‌లో ఈనెల 9న అఖిల భారత యువజ న సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యూత్‌ వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న పిలుపునిచ్చారు.

 9న ఉత్తరాంధ్ర జిల్లాల యూత్‌ వర్క్‌షాప్‌

బొబ్బిలి: విజయనగరం అమర్‌భవన్‌లో ఈనెల 9న అఖిల భారత యువజ న సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యూత్‌ వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గంటి ప్రసాదం స్మారక భవనం సమీపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధా నాలపై యువతకు అవగాహన కల్పిస్తారన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, భగత్‌సింగ్‌ నేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ యాక్టు ద్వారా నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నూతన జాబ్‌క్యాలెండరు ను విడుదల చేయాలని, నిరుద్యోగభృతి కల్పించాలని, ప్రభుత్వ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి యువతకు ఉచిత శిక్షణ అందించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని తదితర ప్రధాన అజెండాతో వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులంతా పెద్దసం ఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ డివిజన్‌ నాయకులు తులసీరావు, మహ్మద్‌, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:09:32+05:30 IST