దేశాభివృద్ధికి యువత నడుంబిగించాలి
ABN , First Publish Date - 2023-02-06T23:44:05+05:30 IST
దేశాభివృద్ధికి యువత నడుంభిగించాలని విశ్వకర్ణ మందిరం మూవ్ ఆన్ ఇండియా వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు అజిద్ కుమార్ ఆచార్య అన్నారు.

డెంకాడ: దేశాభివృద్ధికి యువత నడుంభిగించాలని విశ్వకర్ణ మందిరం మూవ్ ఆన్ ఇండియా వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు అజిద్ కుమార్ ఆచార్య అన్నారు. జొన్నాడ వద్ద గల లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అటాక్ ఆన్ ఎమో షనల్ ఇంటిలిజెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాసక్తితో పాటు, భావోద్వేగ మేధాశక్తి పెంపొందిం చేలా తయారవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆత్మ నిర్బర్ భారత్ వైపు యువత పరిశోధనలు చేయాలని కోరారు. 140 కోట్ల జనాభా గల మన యువ భారతదేశం నేడు వస్తున్న సవాళ్లకు ధీటుగా ఎదుర్కొంటూ మన దేశం పేరు నిలబెట్టాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ టి.మధుసూ దనరావు, ప్రిన్సిపాల్ వీవీ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ టి.హరిబాబు పాల్గొన్నారు.