Share News

వైసీపీని ఇంటికి సాగనంపాలి

ABN , First Publish Date - 2023-11-21T00:19:00+05:30 IST

sss

 వైసీపీని ఇంటికి సాగనంపాలి
మాట్లాడుతున్న విజయరామరాజు :

కొమరాడ: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పిలుపు నిచ్చారు. సోమవారం కళ్లికోటలో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అనాలోచిత విధానాల వల్ల అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏనుగులు ఐదేళ్లుగా రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఏనుగుల సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మం డల కన్వీనర్‌ శేఖర్‌పాత్రుడు, నాయకులు డి.వెంకటినాయుడు, నందివాడ కృష్ణబాబు, పి.వెంకటినాయుడు, ఎన్‌.మధుసూదనరావు, జి.సుదర్శనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:19:05+05:30 IST