వైసీపీకి నూకలు చెల్లాయి

ABN , First Publish Date - 2023-09-18T00:20:50+05:30 IST

వైసీపీకి నూకలు చెల్లాయని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.

వైసీపీకి నూకలు చెల్లాయి

నెల్లిమర్ల: వైసీపీకి నూకలు చెల్లాయని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లిమర్ల లో ఆదివారం నిర్వహించిన రిలే దీక్షల్లో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆధ్వర్యంలో మహిళలు మౌనం పాటించారు. ఈసందర్భంగా బంగా ర్రా జు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతార ని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, పార్టీ నాయకులు సువ్వాడ రవిశేఖర్‌, మహంతి చిన్నంనాయుడు, భోగాపురం మండల కమిటీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, మాజీ ఎంపిపి కంది చంద్ర శేఖర్‌, కడగల ఆనంద్‌కుమార్‌, గేదెల రాజారావు, పసుపులేటి గోపి, కర్రోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.

కడిగిన ముత్యాంలా బయటకు వస్తారు

చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గండి బాబ్జి అన్నారు. నెల్లిమర్లలో చేపట్టిన రిలే దీక్షలను ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసు లు పెట్టారని ఆరోపించారు.

చర్చిలో మాజీ ఎమ్మెల్యే గీత ప్రార్థనలు

విజయనగరం రూరల్‌: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వెంటనే ఆయనను విడుదల చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆదివారం నగరంలోని అర్‌ అండ్‌ బీ వద్ద ఉన్న సెయింట్‌ పాల్‌ లుథరన్‌ చర్చిలో తన అనుచరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. చర్చి ఫాదర్‌ చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ ప్రార్థించారు. ఫ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ టీడీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవ ర్గాల్లో ఐదో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. విజయనగరంలోని టీడీపీ కార్యాల యంలో తెలుగుయువత నాయకులు ఈ నిరసనలు నిర్వహించారు.

Updated Date - 2023-09-18T00:20:50+05:30 IST