ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న వైసీపీ
ABN , First Publish Date - 2023-03-02T23:55:43+05:30 IST
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయానికి గ్రాడ్యుయేట్స్ సహకరించాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పిలుపునిచ్చారు.
విజయనగరం రూరల్: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయానికి గ్రాడ్యుయేట్స్ సహకరించాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పిలుపునిచ్చారు. గురువారం రెండో డివిజన్ పరిధిలోని పూల్‌బాగ్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృత్తి ఎత్తేసి నిరుద్యోగుల నెత్తిన టోపీ వేసిందన్నారు. రూ 5 వేలు చొప్పున ఇచ్చి వలంటీర్లను నియమించి, ఉద్యోగాలు భ ర్తీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. టీడీపీ నగరనాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెంటాడ: చిరంజీవిరావు గెలుపునకు కృషి చేయాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం మెంటాడలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక హైస్కూల్, కేజీబీవీలో ఎన్నికల ప్రచార పరిశీలకుడు వరుపుల రాజాతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు చలుమూరి వెంకటరావు, రవి శంకర్, అన్నవరం, రెడ్డి ఏర్నాయుడు, ఎస్.గురునాయుడు, రోజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం మండలంలోని దెందేరు, సంతపాలెం, నిమ్మలపాలెం, ఉత్తరాపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కోళ్ల వెంకటరమణ, కనకాల శివ, బొబ్బిలి అప్పారావు, గొంప దుర్గా ఉమేష్, కొరుపోలు అప్పారావు, పీవీ రత్నాజీ పాల్గొన్నారు.
శృంగవరపుకోట రూరల్: శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని కోరుతూ గురువారం శృంగవరపుకోట మండలంలో ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జీఎస్ నాయుడు ఆధ్వర్యంలో కొట్టాం, కిల్తంపాలెం, బొడ్డవర, కొట్టాం, తిమిడి పంచాయతీల పరిధిలో పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థించారు. కార్యక్రమంలో శ్రీనురాజు, రాయవరపు రవిశంకర్, బర్లస్వామినాయుడు తదితరులు ఉన్నారు.
శృంగవరపుకోట: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. గురువారం శృంగవరపుకోట రామ్‌నగర్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోని గ్యాడ్యుయేట్ ఓటర్లను కలిసి మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షుడు జీఎస్‌నాయుడు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చెక్కాకిరణ్ కుమార్, నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య తదితరులు ఉన్నారు. తెలుగు దేశం పార్టీ నేత గొంప కృష్ణ ఎస్.కోట పట్టణంలో ఉన్న పలు బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులను కలిశారు. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ఓటు వేయాలని కోరారు. విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్ర శేఖర్ తదితరులున్నారు.
లక్కవరపుకోట: ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడి చిరంజీవిరావును గెలిపించేందుకు యువకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని గంగుబూడిలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, స్థానిక యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.
బొబ్బిలి: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా గురువారం స్థానిక టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులను నేరుగా కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. ఏగిరెడ్డి శ్రీధర్, చింతాడ రవి, తెంటు సీతారాం, చేపేన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, దీనివల్ల ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే కనిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చీపురుపల్లిలో గురువారం జరిగిన టీడీపీ నియోజకవర్గ, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌కుమార్, రమణమూర్తి, తాడ్డి సన్యాసినాయుడు, రెడ్డి గోవిందరావు, కెంగువ ధనుంజయ, చనమల మహేశ్వరరావు పాల్గొన్నారు.
భోగాపురం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని పార్టీ మండల నాయకుడు నీలాపు అప్పలరామి రెడ్డి కోరారు. మండలంలోని చేపల కంచేరు, రెడ్డికంచేరు తదితర గ్రామాల్లో ఆయన గురువారం ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్ర మంలో మైలపల్లి ఎ ల్లాజీ, అప్పలసూరి, నరిశమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మెరకముడిదాం: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించడమే ధ్యేయంగా పని చేద్దామని పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి సన్యాసినాయుడు కోరారు. మండలంలోని ఊటపల్లి, శ్యామయ వలస, పులిగుమ్మి, గాదిల, మర్రివలస, గొట్టిపల్లి పంచాయతీల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. చల్ల శ్రీరామ్, పైడిపునాయుడు, రెడ్డి ఆనంద్, ఆదినారాయణ, సంఘంరెడ్డి సత్యారావు, రామచంద్రుడు, అచ్చంనా యుడు, శ్రీను పాల్గొన్నారు. బైరిపురంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లిమర్ల: టీడీపీ ఎమ్మెల్సీతోనే నిరుద్యోగులకు, పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్ అన్నారు. వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా ఆయన గు రువారం పారసాం గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామ సర్పంచ్ గొలజాన నారాయణరావు, పార్టీ నాయకు లు గొలజాన సూర్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.
సంతకవిటి: టీడీపీ బలపరిచిన ఎమ్మె ల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీరావు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోళ్ల అప్పల నాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు గట్టి భాను కోరారు. గురువారం మామిడిపల్లి, పుల్లిట, సురవరం, మండాకురిటి తదితర గ్రామాల్లో పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను కలిసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు నారాయణప్పడు, వల్లూరు గణేష్, చెలికాన మహేష్‌బాబు, రావు రవీంద్ర, కొంచాడ త్రినాఽథ రావు, శ్రీరాములు, జి.రాజులనాయుడు పాల్గొన్నారు.