వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది

ABN , First Publish Date - 2023-04-03T00:27:45+05:30 IST

నాలుగేళ్ల పాలనలో మోసపూరిత విధానాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మభ్యపె ట్టిందని బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనా యన) ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది

బొబ్బిలి, ఏప్రిల్‌ 2: నాలుగేళ్ల పాలనలో మోసపూరిత విధానాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మభ్యపె ట్టిందని బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనా యన) ధ్వజమెత్తారు. స్థానిక దర్బార్‌ మహల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ పాలనతో పోల్చుకుంటే వైసీపీ పాలనలో గ్రోత్‌ రేటు చాలా ఘోరంగా ఉందని, జాబ్‌ క్యాలెండ ర్‌ ఊసే లేదన్నారు. ప్రభు త్వ ఉద్యోగుల భర్తీ అడ్రస్సే లేదన్నారు. విశాఖలో సమ్మిట్‌ పేరుతో నానా హడా విడి చేశారన్నారు. ఒక్క నట్టూ, బోల్టు పరిశ్రమ లాంటివి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాల పుణ్యమా అని యువతలో అభద్రతా భావం పేరుకుపోయిందని, అనేకమంది యువకులు ఆత్మ హత్య లకు పాల్పడినట్లు పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి ప్రకటించడం సిగ్గుచే టన్నారు. టీడీపీ హయాంలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ఏటా మెగా డీఎస్సీ అని మాయమాటలతో అఽధికా రంలోకి వచ్చిన జగన్‌ ఒక్క టీచర్‌ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన విషయమై రాష్ట్ర యువతకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డి మాండ్‌ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. కనీసం నిరుద్యోగ భృతినైనా ఇవ్వకపోవడం దారుణమ న్నారు. ఇకనైనా యువతను మోసం చేయడం మానుకొని, ఇచ్చిన మాట ప్రకారం జాబ్‌ క్యా లెండర్‌ను ప్రకటించాలని బేబీనాయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-04-03T00:27:45+05:30 IST