రక్త హీనత నివారణకు కృషి

ABN , First Publish Date - 2023-02-07T00:01:55+05:30 IST

కిశోర బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు కృషిచేయాలని డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు ఆదేశించారు.

  రక్త హీనత నివారణకు కృషి

పార్వతీపురం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కిశోర బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు కృషిచేయాలని డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు ఆదేశించారు. సోమవారం జిల్లా ఆస్పత్రి సమావేశ భవనంలో సంబంధితఅధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో వివహాలు, తద్వారా వచ్చే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహ న కల్పించాలన్నారు. పీహెచ్‌సీల వారీగా హెల్త్‌ ప్రోగ్రామ్‌ల ప్రగతి నివేదికలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి, ఆరోగ్య తనిఖీ వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలన్నారు. ప్రసవ సమయానికి వారం రోజులు ముందుగానే సంబంధిత రిఫరల్‌ కేంద్రంలో అడ్మిట్‌ అయ్యేలా చూడాలని, అందుకు అవసరమైన రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రసవం అయ్యే వరకూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పల్లెల్లో గర్భిణులను త్వరగా గుర్తించి రిజిస్ర్టేషన్‌ చేయాలని తెలిపారు. నవ జాతి శిశువుల ఆరోగ్య పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం శిశువుల టీకా కార్యక్రమం నిర్వహించి, ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఫ్యామీలి డాక్టర్‌ పోగ్రామ్‌ ద్వారా పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి పి.జగన్నామోహన్‌రావు, డీపీవో లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:01:55+05:30 IST