పారాదిలో మహిళ మృతి

ABN , First Publish Date - 2023-06-26T00:21:36+05:30 IST

పారాది గ్రామంలో గౌరి(30) అనే వివాహిత ఆదివారం రాత్రి మృతి చెందింది.

పారాదిలో మహిళ మృతి

బొబ్బిలి: పారాది గ్రామంలో గౌరి(30) అనే వివాహిత ఆదివారం రాత్రి మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. రామభద్రపురం మండలం మర్రివలస నుం చి ఏడాది కిందట కుటుంబ సభ్యులు పారాది గ్రామానికి వలస వచ్చి టీ దుకాణం నడుపుతున్నారు. గౌరి తన భర్త రవితో కలిసి చర్చికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌ తగిలి ప్రమాదవశాత్తూ తీవ్రగాయాలతో మృతి చెందినట్లు స్థానికులు చెబు తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2023-06-26T00:21:42+05:30 IST