Share News

ఎన్‌ఈపీతో విద్యారంగం అస్తవ్యస్తం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:44 PM

జాతీయవిద్యావిధానం(ఎన్‌ఈపీ) అమల్లోకి రావ డంతో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని పీడీఎస్‌వోజిల్లా అధ్యక్షుడు ఎం.అప్పల రాజు ఆరోపించారు. ఆదివారం విజయ నగరంలోని సమాఖ్య కార్యాలయంలో విద్యా, ఉపాధి రంగాల్లో ఏర్పడిన సంక్షోభంపై గోడపత్రికను ఆవిష్కరించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రయత్ని స్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీలో భాగంగా చదువుకున్న చదువుకు సంబంధం లేని ఇంటర్న్‌షిప్‌ప్రవేశ పెట్టిందన్నారు. కేంద్రం ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చి, తుంగలో తొక్కిందన్నారు. ఈనెల 22న గుంటూరులో నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సుకు నిరుద్యోగులు, విద్యార్థులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గిరిప్రసాద్‌, దిలిప్‌, రాకేష్‌, రుషి పాల్గొన్నారు.

 ఎన్‌ఈపీతో విద్యారంగం అస్తవ్యస్తం

విజయనగరం దాసన్నపేట: జాతీయవిద్యావిధానం(ఎన్‌ఈపీ) అమల్లోకి రావ డంతో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని పీడీఎస్‌వోజిల్లా అధ్యక్షుడు ఎం.అప్పల రాజు ఆరోపించారు. ఆదివారం విజయ నగరంలోని సమాఖ్య కార్యాలయంలో విద్యా, ఉపాధి రంగాల్లో ఏర్పడిన సంక్షోభంపై గోడపత్రికను ఆవిష్కరించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రయత్ని స్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీలో భాగంగా చదువుకున్న చదువుకు సంబంధం లేని ఇంటర్న్‌షిప్‌ప్రవేశ పెట్టిందన్నారు. కేంద్రం ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చి, తుంగలో తొక్కిందన్నారు. ఈనెల 22న గుంటూరులో నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సుకు నిరుద్యోగులు, విద్యార్థులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గిరిప్రసాద్‌, దిలిప్‌, రాకేష్‌, రుషి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:44 PM