నల్లజెండాలతో..కళ్లకు గంతలు కట్టుకుని..
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:03 AM
తమ సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు శనివారం నాలుగోరోజూ వినూత్నంగా నల్లజెండా లతో, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. విజయనగరం మునిసి పల్ కార్పొరేషన్, రాజాం, బొబ్బిలి మునిసిపాలిటీల్లో కార్మికులు నిరసనలు కొనసాగించారు.

విజయనగరం రింగురోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మునిసిపల్ కార్మికులు విజయనగరం నగరపాలక సంస్థ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ఒంటి కాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూని యన్ రాష్ట్రకమిటీ సభ్యులు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ నాలుగేళ్ల కిందట ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకుండా మునిసిపల్ కార్మికులపై నిర్లక్ష్యధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్య మాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామచంద్రరావు, రాఘవ, రామారావు, వంశీ, శ్రీను, నాగారాజు పాల్గొన్నారు.
ఫ రాజాం రూరల్: సీఎం జగన్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వా త అమలు చేయాలన్న కనీస ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు ఆరోపించారు. రాజాంలో మునిసిపల్ కార్మికులుర నల్లడ్రెస్సులు ధరించి, నల్లజెండాలు పట్టుకుని మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.