శుభకార్యానికి రానివ్వరా..?

ABN , First Publish Date - 2023-03-20T00:25:14+05:30 IST

టీడీపీ చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ నాయకులను ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొందర్ని అదు పులోకి తీసుకున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా

శుభకార్యానికి రానివ్వరా..?

సంతకవిటి: టీడీపీ చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ నాయకులను ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొందర్ని అదు పులోకి తీసుకున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ సంతకవిటి మండలంలోని వాసుదే వపట్నంలో ఓ వివాహానికి హాజరయ్యారు. విష యం తెలుసుకొని కూన రవికుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకోవడానికి ప్రయ త్నించారు. దీంతో కూన ఆగ్రహం వ్యక్తంచేశారు. శుభకార్యాలకు రానివ్వకపోవడం అన్యాయమన్నారు. టీడీపీ కార్యకర్తలపై నిఘా ఉంచడం శోచనీ యమన్నారు. ఇంత లో టీడీపీ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు గట్టి భాను జోక్యం చేసుకొని తమ పార్టీ నాయకులు, కార్య కర్తలు శుభకార్యాలకు రానివ్వకపో వడంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో పోలీసులు వెనుదిరి గారు. ఈ సందర్భంగా రవి కుమార్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో టీడీపీ విజయదుందుభి మో గించడంతో సీఎం జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయిందని తెలిపారు. రాను న్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయ మన్నా రు. ఆయన వెంట టీడీపీ నాయకులు మొయ్యి నారాయణప్పడు, శ్రీరాములు, కొరికా న జనార్దన్‌, గురుగుబిల్లి రాజుల నాయుడు, బొడ్డేపల్లి సూర్యనారాయణ, దుర్గాశి ఆనందరావు ఉన్నారు.

Updated Date - 2023-03-20T00:25:52+05:30 IST