చీపురుపల్లిలో ఉవ్వెత్తున నిరసన

ABN , First Publish Date - 2023-09-10T00:57:12+05:30 IST

చంద్రబాబు అరెస్టుపై నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులకు చీపురుపల్లి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు.

చీపురుపల్లిలో ఉవ్వెత్తున నిరసన
విలేకర్లతో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

చీపురుపల్లి: చంద్రబాబు అరెస్టుపై నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులకు చీపురుపల్లి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునను పోలీసులు ఆయన ఇంటి వద్దే బలవం తంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. నాగార్జునను తీసుకెళ్తున్న పోలీస్‌ వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనానికి అడ్డంగా నిలబడి ముఖ్యమంత్రికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు వాహనం మూడు రోడ్ల కూడలికి చేరుకున్న సమయంలో మరోసారి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. గాంధీ బొమ్మ సెంటరులో కూడా వాహనాన్ని ముందుకు కదలనివ్వలేదు. నాగార్జున స్టేషన్‌లో ఉన్న సమయంలోనూ కార్యకర్తలు స్టేషన్‌ బయట నినాదాలు చేశారు. మరి కొంతమంది గాంధీ బొమ్మ జంక్షన్‌ వద్ద టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. ఒకానొక దశలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కోరాడ రామకృష్ణపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులయిన కార్యకర్తలు అక్కడే నిరసన వ్యక్తం చేశారు.

బాబుకు హాని తలపెడితే చూస్తూ ఊరుకోం

తమ నాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు హాని తలపెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. శనివారం ఆయన చీపురుపల్లిలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. టీడీపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల్ని అరెస్టు చేసినంత మాత్రాన తాము బెదిరిపోవడం లేదన్నారు. జగన్మోహన్‌రెడ్డిని గద్దె దించే వరకూ పోరాడతామన్నారు. ఫ ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు వంటి దని నాగార్జున అన్నారు.చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి పట్టణంలో ఆ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌, చనమల మహేశ్వరరావు, రెడ్డి గోవింద్‌, ముల్లు రమణ, గవిడి నాగరాజు, వెంపడాపు రమణమూర్తి, మీసాల కాశీ, బలగం వెం కటరావు, మహంతి అప్పలనాయుడు, వెంపడాపు రమణమూర్తి, నాగుల పల్లి నారాయణరావు, మన్నెపురి సూర్యనారాయణ, గవిడి సూర్యనా రాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-10T00:57:22+05:30 IST