ఉంగరాడ మెట్ట భూ ఆక్రమణలపై ఏం జరిగేనో!

ABN , First Publish Date - 2023-09-21T00:20:48+05:30 IST

ఉంగరాడమెట్ట ఆక్రమణల వ్యవహారంపై స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది. తెరవెనుక పాత్రదారుల్లో కలవరం నెలకొంది. విషయం బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. ఆ

ఉంగరాడ మెట్ట భూ ఆక్రమణలపై   ఏం జరిగేనో!
ఉంగరాడమెట్ట సర్వేనెంబరు 1లో ఆక్రమణలకు గురైన కొండభూమి

ఉంగరాడ మెట్ట భూ ఆక్రమణలపై

ఏం జరిగేనో!

నోటీసులు జారీ చేసి మిన్నకున్న అధికారులు

ఒక దుకాణ స్థలంపై చర్చలు

అధికార పార్టీలో రాజుకుంటున్న చిచ్చు

వెనక ఉండి నడిపిస్తున్న కొందరు

రేగిడి, సెప్టెంబరు 20: ఉంగరాడమెట్ట ఆక్రమణల వ్యవహారంపై స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది. తెరవెనుక పాత్రదారుల్లో కలవరం నెలకొంది. విషయం బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. ఆక్రమణలపై ఒకే పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చెరో వర్గంగా ఉంటున్నారు.

ఉంగరాడమెట్ట కొండభూముల ఆక్రమణలపై ‘ఆంధ్రజ్యోతి’లో సమగ్ర కథనం వచ్చాక సమస్య అధికారుల దృష్టికి వెళ్లింది. విచారణకు జేసీ ఆదేశించడం.. ఆర్డీవో నేతృత్వంలో తహసీల్దార్‌ పరిశీలించడం జరిగింది. గుళ్లపాడు సర్వేనెంబరు 5, 1లో 4.26 ఎకరాల్లో కొండభూములు కబ్జా అయినట్లు తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి గుర్తించారు. వీటిలో రెండు ఎకరాల్లో ఖాళీ భూములు, మరో రెండు ఎకరాల 26 సెంట్లలో 115వరకు కట్టడాలు ఉన్నట్లు తేల్చారు. కొందరికి నోటీసుల్వివడం.. వివరణ తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత రెండు నెలలుగా ఈ వ్యవహారం నెమ్మదించింది. రెవెన్యూ యంత్రాంగం ముందుకు వెళ్లలేక పోతోంది. దీనివెనుక పెద్దనేతల పాత్ర ఉన్నట్లు సమాచారం. కాగా గుళ్లపాడు రెవెన్యూ సర్వేనెంబరు 1లో ఉంగరాడమెట్ట వద్ద ఒకషాపు నిర్మాణ విషయమై అఽధికార పార్టీలో భిన్నాభిప్రాయలు వచ్చాయి. అక్రమ నిర్మాణదారుకు పంచాయితీ నోటీసులు ఇవ్వడం, ఆ షాపునకు తాళాలు వేయడం తదితర పరిణామాలు ఇటీవల జరిగాయి. అక్రమంగా నిర్మిస్తున్న షాపునకు తాళం వేసినట్లు గుళ్లపాడు పంచాయతీ కార్యదర్శి రామ్‌కుమార్‌ ధ్రువీకరించారు.

సిక్స్‌స్టెప్‌ వేలిడేషన్‌పై కలవరం

ఇళ్ల పట్టాలు జారీచేయాలన్నా.. ఆక్రమణదారులకు పట్టాలు ఇచ్చేయాలన్నా ప్రభుత్వం సూచించిన సిక్స్‌స్టెప్‌ వేలిడేషన్‌లో వారు ఉండకూడదు. అంటే కరెంట్‌మీటరు, ఐదు ఎకరాల పైబడి భూములు, ఫోర్‌వీల్స్‌ వాహనం, గతంలో ఇళ్లు మంజూరు, ఇన్‌కమ్‌టెక్స్‌ చెల్లింపులు తదితర అభ్యంతరాలుంటే ఇళ్ల పట్టాలు పొందేందుకు అనర్హులు. ఇదే సమయంలో ఒక వ్యక్తికి సెంటున్నరకు మించి హౌస్‌సైట్‌ పట్టా ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. దీంతో ఉంగరాడమెట్ట కొండభూముల్లో కొత్తపట్టాలు ఇవ్వాలన్నా, ఉన్న పట్టాలు రెగ్యులర్‌ చేయాలన్నా అధికార పార్టీ పెద్దలకు కుదరడం లేదు. దీనిపై స్థానిక నేతల్లో ఏకాభిప్రాయం కూడా లేదు. ప్రతీ చిన్న విషయానికీ పాలకొండ, విజయనగరం పెద్దనేతల వద్దకు వెళ్తున్నారు. ఈపరిస్థితుల్లో రెవెన్యూ సిబ్బంది నలిగిపోతున్నారు.

- ఉంగరాడమెట్ట కొండ ఆక్రమణల అంశాన్ని చీపురుపల్లి ఆర్డీవో అప్పారావు వద్ద ప్రస్తావించగా, ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. కొంతమంది నుంచి వివరణ తీసుకొన్నట్లు తెలిపారు. దీనిపై తహసీల్దార్‌తో మరోసారి చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-09-21T00:20:48+05:30 IST