ఆసుపత్రే ఇలా ఉంటే ఎలా?
ABN , First Publish Date - 2023-03-14T23:56:19+05:30 IST
రాజాం సామాజిక ఆసుపత్రి నిర్వహణపై ఎన్ డీసీ (నేషనల్ కమ్యూనకబుల్ డిసీజెస్) బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాజాం రూరల్, మార్చి 14: రాజాం సామాజిక ఆసుపత్రి నిర్వహణపై ఎన్ డీసీ (నేషనల్ కమ్యూనకబుల్ డిసీజెస్) బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిర్వహి స్తున్న పరిశీలనలో భాగంగా స్థానిక వంద పడకల ఆసుపత్రిని మంగళవారం బృం దం పరిశీలించింది. స్టెఫీ, నరిశింహులు తదితరుల బృందం ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించింది. దుమ్ము, ధూళితో ఉన్న మందుల గదిపై తీవ్ర అభ్యంత రం వ్యక్తం చేశారు. మందుల విభాగం ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రసూతి వార్డులోని టాయిలెట్లు, ఇతరత్రా పరికరాలు దుర్గంధంతో ఉండడాన్ని తప్పుపట్టారు. పైపులైను లీకవుతున్నా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని సూపరింటెండెంట్ డా.రాజ్యలక్ష్మిని ప్రశ్నించారు. ఇదే వార్డులో లైట్లు వెలగడం లేదని గుర్తించారు. పోస్టు మార్టం గదితో పాటు శస్త్రచికిత్స వార్డు, ఫిజియోథెరపీ వార్డులను పరిశీలించారు. అస్తవ్తస్తంగా ఉన్న అగ్నిప్రమాద నిరోధక పరికరాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి వాతావరణం రోగులకు ఆహ్లాదకరంగా ఉండాలే తప్ప రోగం మరింత పెరిగేలా ఉండకూడదని వైద్య సిబ్బందికి సూచించారు. ఇక్కడ నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం, పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు విలేకరులకు వివరించారు. బృందం వెంట పలువురు వైద్యులు ఉన్నారు.