రాష్ట్రానికి చేసిందేమిటి?

ABN , First Publish Date - 2023-06-11T23:54:25+05:30 IST

కేంద్ర మంత్రి అమిత్‌షా విశాఖకు రావడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు.

రాష్ట్రానికి చేసిందేమిటి?
రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు

కేంద్ర మంత్రి అమిత్‌షా విశాఖకు రావడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. అమిత్‌షా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖకు రైల్వేజోన్‌ ప్రకటించాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అమరావతి రాజధాని నిర్మించాలని, పోలవరం ప్రోజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, ఇలాంటి నాయకులు ఇక్కడ అడుగు పెట్టడానికి అర్హత లేదన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2023-06-11T23:54:25+05:30 IST