బాబుతోనే సంక్షేమం
ABN , First Publish Date - 2023-12-03T00:01:30+05:30 IST
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తోనే సంక్షేమ పాలన సాధ్యమని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.
నెల్లిమర: రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తోనే సంక్షేమ పాలన సాధ్యమని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. అలుగోలులో శనివారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులకు బాండ్లను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, మండల కమిటీ ఉపాధ్యక్షుడు కురిమినేని దివాకర్, గ్రామ అధ్యక్షుడు ఆల్తి బాబూరావు, పార్టీ నాయకులు కెల్ల నారాయణప్పలనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.