‘యువగళానికి’ తరలిరావాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:44 PM
భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభకు తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లో మండలాల నాయకులు, కార్యకర్తలతో సభను విజయవంతం చేయడానికి సోమవారం సమావేశాలు నిర్వహించారు.
భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభకు తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లో మండలాల నాయకులు, కార్యకర్తలతో సభను విజయవంతం చేయడానికి సోమవారం సమావేశాలు నిర్వహించారు.
ఫ లక్కవర పుకోట: యువగళం సభకు నియోజకవర్గం నుంచి 20 వేల మంది బయలుదేరాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని పల్నాడు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలతో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 138 నుంచి 150 సీట్లు వస్తాయని, మరోసారి 1994 ఫలితాలు పునరావృతం కానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గ పరిశీలకుడు బాబ్జీనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్, పార్టీ మండలాధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, బండారు పెదబాబు, కె.రమణమూర్తి పాల్గొన్నారు.
ఫ రేగిడి: పొలిపల్లి సమీపంలో జరగునన్న యువగళం పాదయాత్ర ముగింపు సభకు క్యాడర్ తరలిరావాలని టీడీపీ రాష్ట ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాజాం నియోజకవర్గ టీడీపీ ప్రత్యేక పరిశీలకుడు కొండ్రు జగదీష్ పులుపునిచ్చారు. ఉంగరాడమెట్ట అమరావతి తోటలో సోమవారం రేగిడి మండల టీడీపీ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు కిమిడి అశోక్‌కుమార్, దూబ ధర్మారావు ఆధ్యర్యంలో జరిగింది. కార్యక్రమంలో నాయకులు వి.నాగభూషణరావు, చల్ల భుజంగరావు, మజ్జి శ్రీనివాసరావు, గురవాన ధనంజయ్‌రావు, కె.మహేష్, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఫ తెర్లాం: యువగళం ముగింపు సభను విజయవంతంచేయాలని పార్టీ మండలాధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనాయుడు కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగాల కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి యుగంధర్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్, మాజీ ఎంపీపీ సింహాచలం, ఎంపీటీసీ ఆనంద్ పాల్గొన్నారు.
ఫ రామభద్రపురం: పోలిపల్లిలో జరిగే యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతి నాయుడు కోరారు. బూసాయవలసలో విలేకరులతో మాట్లాడుతూ సభకు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఫ వంగర: యువగళం ముగింపు సభకు తరలిరావాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెఎస్ రాజు కోరారు. వంగరలో మండలస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, మోహనరావు, రవి, దుర్గబాబు, గణపతి, ధనలక్ష్మి, శ్రీను, రవి పాల్గొన్నారు.
ఫ గంట్యాడ: యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ మండలా ధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు కోరారు. గంట్యాడలో ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ ముగింపు సభకు ప్రతి గ్రామం నుంచి సుమారు 300 మంది కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బూడి అప్పలనాయుడు, రంధి చినరామునాయుడు, జి.శ్రీనివాసరావు, పి.సత్యనారాయణ ఉన్నారు.
ఫ చీపురుపల్లి: లోకేష్ పాదయాత్రతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందని అసెంబ్లీ మాజీ స్పీకర్, పార్టీ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. చీపురుపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని, పార్టీ నాయకులు పైల బలరాం, వెన్నె సన్యాసినాయుడు, దన్నాన రామచంద్రుడు, తాడ్డె సన్యాసినాయుడు, గవిడి నాగరాజు, సారేపాక సురేష్, మహంతి అప్పలనాయుడు, శనపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫ బొండపల్లి: యువగళం ముగింపు సభను అన్ని గ్రామాల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కోరారు. మరువాడలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, కోరాడ కృష్ణ, డోకుల శ్రీను పాల్గొన్నారు.
ఫ డెంకాడ: యువగళం ముగింపు భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతిఒక్కరూ హాజరు కావాలని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పూనపర్తి నాని కోరారు.
పోలిపల్లిలో ఈనెల 20న జరిగే యువగళం పాదయాత్ర భారీ ముగింపు సభను ప్రతిఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిపారు.
సమావేశంలో నియోజకవర ్గ పరిశీలకుడు ఎల్‌ఎల్ నాయుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, కాగితాల సత్యనారాయణ రెడ్డి, పాణిరాజు పాల్గొన్నారు.
ఫ నెల్లిమర్ల: పోలిపల్లిలో యువగళం ముగింపు సభ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎల్ నాయుడు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల స్థాయి పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో టీడీపీ పోల్‌మేనేజ్‌మెంట్ నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, పార్టీ మండలాధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు పాల్గొన్నారు.