‘వలంటీర్లకు వందనం’ బహిష్కరిస్తున్నాం

ABN , First Publish Date - 2023-05-26T00:02:09+05:30 IST

వార్డు సచివాలయంలో ఈనెల 26వ తేదీ సోమవారం జరుగునున్న ‘వలంటీర్లకు వందనం‘ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికార వైసీపీకి చెందిన నెల్లిమర్ల నగర పంచాయతీ 2, 3వ వార్డుల కౌన్సిలర్లు పైల భారతి, మొయిద శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

‘వలంటీర్లకు వందనం’ బహిష్కరిస్తున్నాం

నెల్లిమర్ల: వార్డు సచివాలయంలో ఈనెల 26వ తేదీ సోమవారం జరుగునున్న ‘వలంటీర్లకు వందనం‘ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికార వైసీపీకి చెందిన నెల్లిమర్ల నగర పంచాయతీ 2, 3వ వార్డుల కౌన్సిలర్లు పైల భారతి, మొయిద శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈమేరకు వారు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మూడో వార్డులో పనిచేస్తున్న ఐదుగురు వలంటీర్లు వేరే ప్రాంతానికి చెందినవారు కావడం వల్ల కేవలం పింఛన్‌ సొమ్ము పంపిణీకి మాత్రమే పరిమితం అయ్యారని, మిగిలిన సందర్భాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని వారు తెలిపారు. వలంటీర్ల తీరుపై నగర పంచాయతీ అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు చెప్పారు. అందువల్ల వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని, హాజరు కాబోమని ఆ ప్రకటనలో తేల్చిచెప్పారు.

Updated Date - 2023-05-26T00:02:09+05:30 IST