మడ్డువలస రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
ABN , First Publish Date - 2023-02-25T23:56:06+05:30 IST
మడ్డువలస రిజర్వాయర్ ప్రధాన గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి
వంగర, ఫిబ్రవరి 25: మడ్డువలస రిజర్వాయర్ ప్రధాన గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా నీటి విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తొలుత శని వారం ఒకగేటు నుంచి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ జా తికి అంకితం చేసి రెండు దశాబ్దాలు కావడంతో గేట్లు పాడయ్యాయి. రోజూ కొంత నీరు వృథాగా పోతోంది. వర్షాకాలంలో సకాలంలో గేట్లు తెరిచే అవకాశం లేక గీతనా పల్లి, కె.చాకరాపల్లి, కొప్పర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. సమస్యను గు ర్తించిన ఉన్నతాధికారులు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అంచనా లు తయారు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ సిబ్బంది దాదాపు రూ.50 కోట్లతో అంచనాలు తయారు చేయగా మొదటగా రూ.18 కోట్లు విడుదల చేసి అన్‌లైన్ ద్వారా టెండర్‌ను ఖరారు చేశారు. పనులు మార్చిలో చేపడ్తామని చెప్పడంతో ముందుగా నీరు విడుదలకు అధికారులు చర్యలు చేప ట్టారు. శనివారం ఒక ప్రదాన గేటు తెరిచి 200 క్యూసెక్కుల నీరు నాగావళిలోకి వి డుదల చేసినట్లు డీఈ నర్మదా పట్నాయక్, ఏఈ నీతిన్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 500 క్యుసెక్కుల నీరు పంట లకు, చెరువులు నింపు కోవడానికి విడుదల చేస్తున్నామన్నారు. రిజ ర్వాయర్‌లో నీరు ఇప్పటికే బాగా తగ్గిందని, కొద్దిరోజుల్లో పూర్తిగా నీటి ని ఖాళీ చేస్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా కుడి కాలువ ద్వారా వచ్చిన నీటిని చెరువులకు మళ్లించి రైతులు పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రాధాన గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాక వర్షాలు పడేంతవరకు నీరు చేరే అవకాశం ఉండదన్నారు. నీటి విడుదల సామర్థ్యం మరో రెండు రోజుల్లో పెంచి రిజర్వాయర్‌ను పూర్తిగా ఖాళీ చేస్తామని చెప్పారు.