పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:12 AM
పెరిగిన ధరలకు అనుగుణంగా పంచా యతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనా లు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్ చేశారు.
గజపతినగరం: పెరిగిన ధరలకు అనుగుణంగా పంచా యతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనా లు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పురిటిపెంట ఈఓ జనార్దనరావుకు బుధవారం అందజేశారు. ఈసం దర్భంగా ఆమె మాట్లాడుతూ 2021లో రూ.1500 వేతనం పెంచారని.. మూడేళ్లు కావస్తున్నందున ధరలు కూడా పెరగడంతో వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్మికులు నాగేశ్వరరావు, కృష్ణ, కోటి పాల్గొన్నారు.