రోడ్డు ప్రమాదంలో వీఆర్‌వో మృతి
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:55 AM
వీరఘట్టం మండలం చిదిమి వీఆర్‌వో రాజారావు (51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు గురువారం రాత్రి బైక్‌పై వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వెళుతున్న రాజారావును ఎం.రాజపురం జంక్షన్ సమీపంలో పాలకొండ నుంచి వీరఘట్టం వెళుతున్న కారు ఢీకొంది.
పాలకొండ (వీరఘట్టం): వీరఘట్టం మండలం చిదిమి వీఆర్‌వో రాజారావు (51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు గురువారం రాత్రి బైక్‌పై వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వెళుతున్న రాజారావును ఎం.రాజపురం జంక్షన్ సమీపంలో పాలకొండ నుంచి వీరఘట్టం వెళుతున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. తొలుత స్థానిక ఏరియా ఆసుపత్రికి... అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. రాజారావు స్వగ్రామం పాలకొండ మండలం అవలంగి వెంకటాపురం.