Share News

వేపాడను కరువు మండలంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2023-11-06T23:53:57+05:30 IST

వేపాడ మండలాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని... వర్షాభావ పరిస్థితులతో పంటను నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల వంతున చెల్లించాలని ఎస్‌.కోట టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్‌ చేశారు.

వేపాడను కరువు మండలంగా ప్రకటించాలి

వేపాడ, నవంబరు 6: వేపాడ మండలాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని... వర్షాభావ పరిస్థితులతో పంటను నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల వంతున చెల్లించాలని ఎస్‌.కోట టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం మండ ల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ ప్రసన్న కుమార్‌కు వినతిపత్రం అందించారు. పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి పెదగుడిపాల సమీపంలో ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాగుండాలంటే బాబు రావా లి.. సైకో పోవాలి..రాష్ట్రం బాగుండాలంటే బాబు రావాలి అంటూ నినదించారు. పంటలను నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర మంత్రులు బస్సు యాత్రలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపికి ఓటుతో బుద్ధి చెప్పక తప్పదని అన్నారు. ఈ కార్యక్ర మంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, నాయకులు భోజంకి మహేష్‌, నిరుజోగి బంగారునాయుడు, కోన సత్యనారాయణ, వేచలపు జగ్గుబాబు, ఎన్‌.నాయుడుబాబు, వేచలపు రామకృష్ణ, నిరుజోగి దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:53:59+05:30 IST