ట్రైనీ సహాయ కలెక్టర్‌గా వెంకట్‌ త్రివినాగ్‌

ABN , First Publish Date - 2023-05-26T00:11:25+05:30 IST

జిల్లాకు శిక్షణ కోసం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో విధుల్లో చేరారు. కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆమె చాంబర్‌లో కలిసి బాధ్యతలు చేపట్టారు.

ట్రైనీ సహాయ కలెక్టర్‌గా వెంకట్‌ త్రివినాగ్‌
కలెక్టర్‌ను కలిసిన ట్రైనీ కలెక్టర్‌ త్రివినాగ్‌

కలెక్టరేట్‌, మే 25: జిల్లాకు శిక్షణ కోసం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో విధుల్లో చేరారు. కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆమె చాంబర్‌లో కలిసి బాధ్యతలు చేపట్టారు. ఈయన 2022 సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. హైదరాబాద్‌ ఐఐటీలో మెటలర్జీ బ్రాంచిలో చదువుకుని 2020లో బీటెక్‌ పూర్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం, ముంబై తదితర నగరాల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. వెంకట త్రివినాగ్‌ తండ్రి జయకుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదాయపన్ను కమిషనర్‌గా పని చేస్తున్నారు. బ్యాడ్మింటన్‌, వ్యాయామం అంటే తనకు ఇష్టమని చెప్పారు.

Updated Date - 2023-05-26T00:11:25+05:30 IST