ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2023-03-02T23:58:12+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉండటానికి గత 75 సంవత్సరాలుగా మన ప్రాంత నాయకులకు రాష్ట్ర పాలనలో కీలక పాత్ర లభించక పోవడమే కారణమని ఉత్తరాంధ్ర పార్టీ కన్వీనర్‌ మెట్ట రామారావు అన్నారు

ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యం

కలెక్టరేట్‌, మార్చి 2: ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉండటానికి గత 75 సంవత్సరాలుగా మన ప్రాంత నాయకులకు రాష్ట్ర పాలనలో కీలక పాత్ర లభించక పోవడమే కారణమని ఉత్తరాంధ్ర పార్టీ కన్వీనర్‌ మెట్ట రామారావు అన్నారు. ఉత్త రాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం తమ పా ర్టీని ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి గట్టు నుంచి ఇచ్ఛాపురం వరకూ అనేక పుష్కలమైన వనరులు ఉన్నా కనీసం రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎటువంటి అభివృ ద్ధికి నోచుకోలేదని దీని వల్ల ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా వెనుక బడి ఉంటున్నారని ఆరోపించారు. ఇక్కడ గిరిజనులు, నిరుపేదలకు ఎటువంటి ఉపాధి కల్పించలేదని, ఉత్తరాంధ్రలో 450 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న మత్య్సకారులు తమిళనాడుకు ఉపాధి కోసం వెళ్లాల్సిన పరిస్థితి రావ డం దురదృష్టకరమన్నారు. ఇక్కడ పుష్కలంగా సాగునీరు అందజేస్తే ఈ ప్రాంత రైతులు పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండేది కాదని, ఈ సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో 53 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానా లకు తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పేడాడ జనార్దనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-02T23:58:12+05:30 IST