3న యూటీఎఫ్ పోరుబాట
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:36 PM
ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌కు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షుడు బోడెల విజయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
సాలూరు రూరల్, డిసెంబరు 29: ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌కు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షుడు బోడెల విజయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దీనిపై వచ్చే నెల 3న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సంక్రాంతి సమీపిస్తున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. 12 పీఆర్సీకి అతీగతీలేకుండా పోయిందని తెలిపారు. పీఆర్సీ, డీఏ ,పీఎఫ్, ఏపీజీఎల్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ‘పోరుబాట’కు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. ఆయన వెంట సాలూరు మండల ప్రధాన కార్యదర్శి ఎ.గణేష్ ఉన్నారు.