కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి
ABN , First Publish Date - 2023-04-03T00:31:08+05:30 IST
ఆంధ్రా, ఒడిశా రెండు రాష్ట్రాల వివాదాస్ప ద సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొఠియా గ్రామాల పరిధిలో పర్యటించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞత కోల్పోయి ప్రవర్తించా రని, తక్షణమే మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు.
విజయనగరం దాస న్నపేట: ఆంధ్రా, ఒడిశా రెండు రాష్ట్రాల వివాదాస్ప ద సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొఠియా గ్రామాల పరిధిలో పర్యటించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞత కోల్పోయి ప్రవర్తించా రని, తక్షణమే మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత ప్రజల మధ్య శాంతి, సౌభ్యాగాల కోసం పనిచేస్తానని చెప్పి మంత్రిగా బాధ్యతలు తీసు కున్న వ్యక్తి పగులు, చెన్నూరులో పర్యటించి ఏపీ పోలీసులను అవమానించేలా కేంద్రమంత్రే స్వయంగా గో బ్యాక్ అంటూ ఎలా నినాదాలు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పును కాదని మాట్లాడిన మంత్రిపై సుప్రీం కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శ్రీను, భాస్కర్, ఎర్ని బాబు తదితరులు పాల్గొన్నారు.