వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగింది

ABN , First Publish Date - 2023-03-05T23:58:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై శాసన మండలిలో నిలయదీయగల సత్తా కేవలం టీడీపీ సభ్యులకు మాత్రమే ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగింది

చీపురుపల్లి: వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై శాసన మండలిలో నిలయదీయగల సత్తా కేవలం టీడీపీ సభ్యులకు మాత్రమే ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయుడిగా చాలా కాలం పాటు పని చేసి ఎందరినో తీర్చిదిద్దిన చిరంజీవిరావును పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు రౌతు కాము నాయుడు, ముల్లు రమణ, గవిడి నాగరాజు, ఆరతి సాహు, తదితరులు పాల్గొ న్నారు. ఫ దత్తిరాజేరు: వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పెదమానాపురం గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, ఎన్నికల పరిశీలకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా ఆకస్మిక మృతికి సంతాపం తెలిపి, మౌనం పాటించారు. అనంతరం కేఏ నాయుడు మాట్లా డుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, ఒక్క పరి శ్రమ కూడా ఏర్పాటు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మం డల నాయకులు పెద్దింటి మోహనరావు, అల్లు విజయ్‌, వేమల చైతన్య బాబు, గుషిడి జగన్నాథం, పి.కేశవరావు, మజ్జి మహేష్‌, గాడి అప్పలనాయుడు, రౌతు దుర్గారావు, పాల్గొన్నారు. ఫ రాజాం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పార్టీ రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి కోరారు. ఆదివారం వస్త్రపురి, గాయిత్రీ తదితర కాలనీల్లో చిరంజీవిరావు ను గెలిపించాలని ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అగడాలను అరి కట్టాలంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయుకులు టంకాల కన్నంనాయుడు, పిల్లా సత్యంనా యుడు, తెంటు కమలనాయుడు, ఆటో కోటి,గులివిందల సూర్యనారాయణ, జర జాన నీలయ్య, బొత్స లక్షున్నాయుడు, పెంకి శివకుమార్‌ పాల్గొన్నారు.

ఫవిజయనగరం రూరల్‌: టీడీపీ బలపరి చిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు తరుపున మండల పరిధిలోని సుంకరిపేట, మలిచర్ల, బియ్యా లపేట గ్రామాల్లో ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మాజీ మం త్రి చిక్కాల రామచంద్రరావు, మెంట పార్థసా రధి గ్యాడ్యూట్స్‌ ఇంటింటికి వెళ్లి ప్ర చారం నిర్వహించారు. నాలుగేళ్ల కాలంలో ఈ ప్రభు త్వం రాష్ట్రంలో నిరుద్యో గితను పెంచిందని, నిరుద్యోగ భృతిని ఎత్తివేశారని టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఫ బాడంగి: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. మండలంలోని కోడూరు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవి ఆధ్వర్యంలో టీడీపీ నేత లంతా ప్రచారా న్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు యువకులు, ఉద్యోగులు, ఉపాధ్యా యులు, మేధావు లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేశారు. సైకో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని టీడీపీ నేతలు అంద రూ పిలుపునిచ్చారు. ఎస్‌.భాస్కరరావు, ఎల్‌.సత్యం, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ శృంగవరపుకోట రూరల్‌: శృంగవరపుకోట మండలంలోని పలు పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ నియోజకవర్గ నేత గొంప కృష్ణ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించా లని కోరుతూ ప్రచారం నిర్వహించారు. లలితకుమారి మండలంలోని సీతారాం పురం గ్రామంతో పాటు శృంగవరపుకోట మేజ ర్‌ పంచాయతీ, పలు వీధుల్లో ప్రచారం చేయ గా, గొంప కృష్ణ మండలంలోని వీరనారాయ ణం, బొడ్డవర, గోపాలపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. ఫ లక్కవరపుకోట: మండలంలోని రంగారాయపురం గ్రామంలో ఆదివారం ఉదయం మండల తెలుగు యు వత అధ్యక్షుడు శ్రీనాథ్‌ రాజేష్‌ ఆధ్వర్యంలో యువకులంతా కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాస్టర్‌ చి రంజీవిరావును మొదటి ప్రాధాన్య ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరారు. ని యోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి కరెడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. గ్రామ కమిటీలు పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు కాశీవిశ్వేశ్వరరావు, రంగారాయ పురం సర్పంచ్‌ కరెడ్ల రామలక్ష్మి, సీతన అప్పన్నదొర తదితరులు పాల్గొన్నారు. ఫ గంట్యాడ: అరాచకాలకు పా ల్పడుతున్న వైసీపీ నాయుకులను ఇంటికి పంపించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌ నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివా రం బుడతనాపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రొంగళి కృష్ణ, బూడి అప్పలనాయుడు, రంధి సురేష్‌, వర్రి సన్యాసిరావు, కుప్పిరెడ్డి వెంకటేష్‌, వర్రి శ్రీను, చల్ల రవి పాల్గొన్నారు. ఫ నెల్లిమర్ల: టీడీపీ ఎమ్మెల్సీలతోనే పట్టభద్రుల కు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌ అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మ ద్దతుగా మండలంలోని చంద్రంపేట, టెక్కలి గ్రామాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని అన్నారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వే యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది సత్యనారాయణ, నేతేటి స్వామినాయుడు, రాజినాయుడు, సన్యాసప్పడు, నాగేశ్వరరావు, విశ్వేశ్వరరావు, సీతంనాయుడు పాల్గొన్నారు. నగర పంచాయతీలో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షురా లు బయిరెడ్డి లీలావతి, తెలుగు యువత నాయకుడు బయిరెడ్డి కళ్యాణ్‌చక్రవర్తి ప్రచారం చేశారు.

గెలుపు కోసం ప్రార్థనలు..

విజయనగరం రూరల్‌: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ తెలుగుయువత నాయకులు ఆది వారం ఖాదర్‌బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో తెలుగుయువత నాయకులు మాతా బుజ్జి, పీతల కోదండరామ్‌, ఇమ్రాన్‌, చంద్రకాంత్‌ చందు, అప్పరబోతు శ్రీను, ఖండవిల్లి బాబ్జీ పాల్గొన్నారు.

కొత్తవలస: ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావు గెలుపుకోసం శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌ కొత్తవలస పంచాయతీ రాజపాత్రుని పాలెం గ్రామానికి చెందిన రాములమ్మకు ప్రత్యే పూజలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఆదివారం గ్రామానికి వెళ్లి సంప్రదాయం ప్రకారం పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో మాకెన సీతారామపాత్రుడు(నవీన్‌) కోళ్ల వెంకట రమణ, బొబ్బిలి అప్పారావు, కనకాల శివ, బంగారు రమేష్‌, కొరుపోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:58:11+05:30 IST