చె ట్టుకొమ్మ విరిగి ఇద్దరు మహిళలకు గాయాలు
ABN , First Publish Date - 2023-05-25T23:56:22+05:30 IST
మండల పరిధిలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఫ్లాట్‌ఫాంపై ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్టుకొమ్మ విరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

దత్తిరాజేరు: మండల పరిధిలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఫ్లాట్‌ఫాంపై ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్టుకొమ్మ విరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగడ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న డీఎంయూ ట్రైన్ దిగి ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికులు నడుస్తుండగా ఆకస్మికంగా వీచిన గాలులకు ఫ్లాట్‌ఫాం పక్కనే ఉన్న చెట్టుకొమ్మ విరిగి పడింది. దీంతో టి.బూర్జివలస గ్రామానికి చెందిన ఇనుము ల పార్వతమ్మకు తీవ్ర గాయాలు కాగా, ఇనుముల రాజేశ్వరికి స్వల్ప గాయాల య్యాయి. వీరిని దత్తిరాజేరు పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్సచేశారు. తీవ్రగా యాలైన పార్వతమ్మను గజపతినగరం ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.