Share News

వేర్వేరు ఘటనలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2023-10-21T23:39:49+05:30 IST

జిల్లాలోని వేర్వేరు ఘటనల్లో శనివారం ఇద్దరు మృతిచెందారు. బొండ పల్లి మండలంలోని గరుడుబిల్లి వద్ద పొలానికి వెళ్తున్న సమయంలో ట్రాక్‌ దాటుతుండగా ఒకరు రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. భోగాపురంలో పొలంలో పనులు ముగించుకొని ఇంటికొస్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

 వేర్వేరు ఘటనలో ఇద్దరి మృతి

జిల్లాలోని వేర్వేరు ఘటనల్లో శనివారం ఇద్దరు మృతిచెందారు. బొండ పల్లి మండలంలోని గరుడుబిల్లి వద్ద పొలానికి వెళ్తున్న సమయంలో ట్రాక్‌ దాటుతుండగా ఒకరు రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. భోగాపురంలో పొలంలో పనులు ముగించుకొని ఇంటికొస్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

పంటపొలానికి వెళ్తుండగా...

బొండపల్లి: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన గరుడుబిల్లిలో శనివారం చోటుచేసుకుంది. విజయనగరం రైల్వే ఎస్‌ఐ రవివర్మ కథనం మేరకు... గరుడుబిల్లి గ్రామానికి చెందిన పిళ్లా పైడినాయుడు(53) గ్రామంలోని రైల్వే ట్రాక్‌ దాటి పంట పొలానికి వెళ్తున్నాడు.ఆ సమయంలో వేగంగా రెండు ట్రాకులపైన ఒకేసారి రైళ్లు వచ్చాయి. దీంతో ఒక ట్రాకు దాటి వేరే ట్రాక్‌కు వెళ్లగా, రైలు ఢీకొట్టింది. పైడినాయుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు.

పొలం పనులు ముగించుకొని వస్తుండగా..

భోగాపురం: భోగాపురంలోని ముక్కాం జంక్షన్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భోగాపురం పసుపులేటి వీధికి చెందిన పసుపులేటి వెంకటరావు(61) మృతిచెందినట్లు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి శనివారం తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు... పసుపులేటి వెంకటరావు వ్యవ సాయ పనులు చేసుకొని జీవిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే పొలం పనులు ముగించుకుని ముక్కాం వైపు నుంచి భోగాపురానికి వచ్చే ఆర్‌అండ్‌బీ రహదారిలో నడుచుకొని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో ముక్కాం వైపు నుంచి క్వారీ లారీ భోగాపురం వైపు వస్తోంది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడను కునేలోగా భోగాపురం ముక్కాంజంక్షన్‌లో వెంకటరావును వెనుక నుంచి లారీ ఢీకొని, కాళ్ల పైనుంచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్నవారంతా కేకలు వేయడంతో లారీ నిలిపి మళ్లీ వెనక్కుపోనిచ్చాడు. దీంతో గాయపడిన వెంకటరావు అక్కడి కక్కడే మృతిచెందాడు.విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు ఘట నా స్థలానికి చేరుకున్నారు. వెంకటరావుకు కుమార్తె, భార్య కొండమ్మ ఉన్నారు. వెంకటరావు భార్య పసుపులేటి కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకటరావు మృతితో పసుపులేటి వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2023-10-21T23:39:49+05:30 IST