Share News

నిజం గెలవాలి

ABN , First Publish Date - 2023-10-30T01:49:33+05:30 IST

జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం అంటూ పార్టీ ఇచ్చిన పిలుపును టీడీపీ శ్రేణులు ఆచరించాయి. వాకిళ్లు.. బాల్కనీలు.. వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి.

నిజం గెలవాలి

నిజం గెలవాలి

ప్రభుత్వ కళ్లు తెరిపించేలా నిరసన

విజయనగరం రూరల్‌, అక్టోబరు 29: జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం అంటూ పార్టీ ఇచ్చిన పిలుపును టీడీపీ శ్రేణులు ఆచరించాయి. వాకిళ్లు.. బాల్కనీలు.. వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి. నిజం గెలవాలని నినాదాలు చేశాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పాల్గొన్నారు. నెల్లిమర్లలో కర్రోతు బంగార్రాజు, గజపతినగరంలో కేఏ నాయుడు, బొబ్బిలిలో బేబీనాయన, ఎస్‌.కోటలో కోళ్ల లలితకుమారి, రాజాంలో కోండ్రు మురళీమోహన్‌ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో గుండాలపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.

గరివిడి మండలంలో నిరసన తెలియజేస్తున్న కిమిడి నాగార్జున

Updated Date - 2023-10-30T01:49:33+05:30 IST