జ్వరంతో గిరిజన బాలుడికి తీవ్ర అస్వస్థత
ABN , First Publish Date - 2023-06-26T23:42:39+05:30 IST
దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలోని కుంబి గ్రామానికి చెందిన కె.శశివర్ధన్ తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యాడు.
సీతంపేట: దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలోని కుంబి గ్రామానికి చెందిన కె.శశివర్ధన్ తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి సోమవారం తరలించారు. పరిస్థితి ఆందో ళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి(రిమ్స్) మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు. జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో శశివర్ధన్ కోమాలోకి వెళ్లడంతో బ్రెయిన్‌కు సిటీ స్కాన్ తీయాల్సి ఉంటుందని, ఆ సదుపాయం ఇక్కడ లేకపోవడం వల్లనే రిఫర్ చేశామని చిన్న పిల్లల వైద్య నిపుణుడు శ్రీనివాసరావు తెలిపారు. ఏజెన్సీలో జ్వరాలు అధికంగా ఉన్నాయని, విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్వరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. ఇప్పటికే సీతంపేట ఆసుపత్రిలో విద్యార్థినులు కవిత, పావనిజ్వరంతో బాధపడి చికిత్స పొందుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు.