నిరుద్యోగ యువతకు శిక్షణ

ABN , First Publish Date - 2023-03-19T00:02:27+05:30 IST

పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాష్‌ యోజన 4.0 పథకంలో బాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ వి.రవికుమార్‌, కో-ఆర్డినేటర్లు అశోక్‌, తిరుపతిరావు తెలిపారు.

 నిరుద్యోగ యువతకు శిక్షణ

సాలూరు,మార్చి 18: పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాష్‌ యోజన 4.0 పథకంలో బాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ వి.రవికుమార్‌, కో-ఆర్డినేటర్లు అశోక్‌, తిరుపతిరావు తెలిపారు. శనివారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ.. అసిస్టెంట్‌ ఎలక్ర్టీషియన్‌, టు వీలర్‌ సర్వీస్‌ అసిస్టెంట్‌ లకు సంబంధించి సుమారు 240 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వారు అర్హులని, పదో తరగతి పాసై ఉండాలని చెప్పారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున 90 రోజుల పాటు శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం ఈ 94947 77553 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2023-03-19T00:02:27+05:30 IST