ట్రాఫికర్‌..

ABN , First Publish Date - 2023-03-26T00:31:11+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో పరిస్థితి ఇది. శనివారం ట్రాఫిక్‌ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ట్రాఫికర్‌..
కంగటి వారి వీధి కూడలి వద్ద నిలిచిన వాహనాలు

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో పరిస్థితి ఇది. శనివారం ట్రాఫిక్‌ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలో నిరీక్షించలేక నానా అవస్థలు పడ్డారు. వాహనాల రద్దీతో రోజురోజుకూ ఈ సమస్య తీవ్రతరమవుతోంది. పట్టణంలో పలు కూడల్లో ట్రాఫిక్‌ జాం అవుతోంది. అయినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై జిల్లాకేంద్రవాసులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

- పార్వతీపురంటౌన్‌

Updated Date - 2023-03-26T00:31:11+05:30 IST