శ్రీరామనవమికి ‘తోటపల్లి’ సిద్ధం

ABN , First Publish Date - 2023-03-29T00:29:01+05:30 IST

ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి సిద్ధమైంది.

 శ్రీరామనవమికి ‘తోటపల్లి’ సిద్ధం
తోటపల్లి దేవస్థానం

గరుగుబిల్లి, మార్చి 28 : ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి సిద్ధమైంది. వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌ మంగళవారం తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ. 500 కార్యాలయంలో చెల్లించాలన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Updated Date - 2023-03-29T00:29:01+05:30 IST