Share News

నేడు కార్తీక పౌర్ణమి

ABN , First Publish Date - 2023-11-26T00:14:01+05:30 IST

కార్తీకమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. ఇక సోమవారం, ఏకాదశి, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి రోజులు మరింత ప్రభావవంతమైనవిగా భక్తులు భావిస్తారు. వీటిలో ఒకటైన పౌర్ణమి ఆదివారమే కావడంతో పూజలు, అభిషేకాలు, దీపారాదనలకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నేడు కార్తీక పౌర్ణమి

నేడు కార్తీక పౌర్ణమి

సిద్ధమైన ఆలయాలు

కనువిందు చేయనున్న జ్వాలా తోరణాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి):

కార్తీకమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. ఇక సోమవారం, ఏకాదశి, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి రోజులు మరింత ప్రభావవంతమైనవిగా భక్తులు భావిస్తారు. వీటిలో ఒకటైన పౌర్ణమి ఆదివారమే కావడంతో పూజలు, అభిషేకాలు, దీపారాదనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. పూజల్లో ఉపయోగించే పూలు, పండ్లు, ద్రవ్యాల కొనుగోలుకు శనివారం మార్కెట్‌కు క్యూ కట్టారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలు.. సాయంత్రం ప్రత్యేక పూజలు.. వాయనాలు ఇవ్వడం.. ప్రసాదాన్ని ఇరుగుపొరుగు వారికి పంచడం ఆనవాయితీ. పౌర్ణమి రోజున కార్తీక దీపాలు వెలిగించడం చాలా మంచిదని భక్తులు భావిస్తారు. ఈ దీపాల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గి వాతావరణం శుద్ధి అవుతుందని, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. కాగా కార్తీక పౌర్ణమి పూజలకు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ సిద్ధమయ్యాయి. విద్యుత్‌దీపాల వెలుగుల్లో శోభాయమానంగా కన్పిస్తున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం అఖండ హారతితో పాటు జ్వాలా తోరణాలు కూడా నిర్వహించనున్నారు. ఎస్‌.కోటలో అఖండ దీపారాధన నిర్వహిస్తుండగా, రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం తదితర ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయనగరంలోని రింగురోడ్డులో పశుపనాథేశ్వర స్వామి ఆలయంలో ఏటా జ్వాలాతోరణం చేపడుతుంటారు.

--------

Updated Date - 2023-11-26T00:14:03+05:30 IST