మూల్యాంకనానికి సమయం పెంచాలి

ABN , First Publish Date - 2023-02-07T00:01:00+05:30 IST

జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్‌ఏ-3 పరీక్షల (యూనిట్‌ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.

మూల్యాంకనానికి సమయం  పెంచాలి

పార్వతీపురం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్‌ఏ-3 పరీక్షల (యూనిట్‌ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. పదో తేదీ వరకూ పరీక్షలు జరగ్గా, ఈ పేపర్లను 12వ తేదీలోపు దిద్దాలని 14లోపు మార్కులు పోస్టు (ఆన్‌లైన్‌/రిజిస్టర్‌)చేయాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఇన్విజ్‌లేటర్లుగా పనిచేస్తూ ఉపాధ్యాయులు ఎలా పేపర్తు ఎలా దిద్దుతారని ప్రశ్నించారు. 11, 12 తేదీల్లో (రెండో శనివారం ,ఆదివారం) పాఠశాలలకు సెలవు నేపథ్యంలో పేపర్లు దిద్దడం ఎట్టి పరిస్థితిలోను సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచి, మానసికంగా వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి పేపర్లు దిద్దడానికి నాలుగురోజులు సమయం పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-07T00:01:01+05:30 IST