సీఎం పర్యటనకు పటిష్ట భద్రత
ABN , First Publish Date - 2023-06-26T23:48:31+05:30 IST
కురుపాంలో బుధవారం సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
కరుపాం,జూన్26: కురుపాంలో బుధవారం సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. సోమవారం మండలకేంద్రంలో భద్రత సిబ్బందితో సమీక్షించారు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలపై పోలీసు అధికారలు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బందికి డ్యూటీలను కేటాయించారు. అన్ని చోట్లా అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డ్యూటీ సమయంలో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధిత అధికారి ద్వారా సమాచారం అందించాలన్నారు. మౌలిక వసతులు, భోజనాల ఏర్పాటులో సమస్యలుంటే నేరుగా తనకు తెలియజేయాలన్నారు.