దాడి కేసులో ముగ్గురు యువకుల అరెస్టు

ABN , First Publish Date - 2023-09-26T00:12:33+05:30 IST

జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ షాపింగ్‌ మాల్‌ సమీ పంలో ఈ నెల 19న తెల్ల వారుజామున కోడి రామ పృధ్వీకుమార్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ముగ్గు రు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. డబ్బు లు లేకపోవడంతో కొట్టి.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయారు.

దాడి కేసులో ముగ్గురు యువకుల అరెస్టు

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ షాపింగ్‌ మాల్‌ సమీ పంలో ఈ నెల 19న తెల్ల వారుజామున కోడి రామ పృధ్వీకుమార్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ముగ్గు రు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. డబ్బు లు లేకపోవడంతో కొట్టి.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐలు భాస్కరరావు, అశోక్‌కుమార్‌ దర్యాప్తు చేశారు. ఈ నెల 25న (సోమవారం) కేఎల్‌పురానికి చెందిన నాగళ్ల వంశీ, పత్తికాయల అశోక్‌ (రామవరం), సింగపూర్‌ సిటీకి చెందిన వేమల కార్తిక్‌లు బైక్‌పై కేఎల్‌పురంలో తిరుగుతున్నట్టు సమాచారం అందుకుని పట్టుకున్నారు. వారి నుంచి ముబైల్‌ను రికవరీ చేసి, బైక్‌ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-09-26T00:12:33+05:30 IST