తోటపల్లి పైపులైన్‌ లీక్‌

ABN , First Publish Date - 2023-07-21T00:06:41+05:30 IST

: పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొట్నానరామినాయుడువలస వద్ద పైపులైన్‌ లీకు అవడంతో తాగునీరు వృథాగా పోతుంది.

తోటపల్లి పైపులైన్‌ లీక్‌

గరుగుబిల్లి, జూలై 20: పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొట్నానరామినాయుడువలస వద్ద పైపులైన్‌ లీకు అవడంతో తాగునీరు వృథాగా పోతుంది. దీంతో పార్వతీపురం పట్టణవాసులకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరాకాక ఇబ్బందులు పడుతున్నారు. వృథా అవుతున్న నీటితో స్థానిక రైతులు ఉభాలు చేసుకుంటున్నారు. పైపులైన్లపై పర్యవేక్షణ కొరవడడంతో నిత్యం ఈ మార్గంలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. లీకులను అరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-07-21T00:06:41+05:30 IST