పట్టభద్రులదే ఈ విజయం

ABN , First Publish Date - 2023-03-20T00:22:16+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంపై విజయనగరం నియోజకవర్గంలో విజ యోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని ద్వారపూడి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు ఆధ్వర్యంలో ఆది వారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

పట్టభద్రులదే ఈ విజయం

విజయనగరం రూరల్‌, మార్చి 19: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంపై విజయనగరం నియోజకవర్గంలో విజ యోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని ద్వారపూడి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు ఆధ్వర్యంలో ఆది వారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ద్వారపూడి గ్రామంలోని అన్ని కూ డళ్ల మీదుగా ఈ ర్యాలీ సాగింది. గ్రాడ్యుయేట్స్‌ ఓటర్లను కలిసి కృతజ్ఞతలు తె లిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో పట్టభద్రులు సరైన తీర్చు ఇచ్చారని, నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధా నాలతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో అరాచకం పరాకాష్టకు చే రిందన్నారు. ఈ ఎన్నికల్లో విద్యావంతులు ఓటేసి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పార న్నారు. కార్యక్రమంలో ద్వారపూడి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం నగరంలోని ఒకటో డివిజన్‌ పరిధిలో మాజీ కౌన్సిలర్‌ మురగడాపు పార్వతీ అధ్యక్షతన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఆల్తి బంగా రుబాబు హాజరయ్యారు. విజయం సాధించిన నేపథ్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సంద ర్భంగా ఆల్తి బంగారు బాబు మాట్లాడుతూ ఈ విజయం స్ఫూర్తితో ఏడాదిలో జరగ నున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నక్కిళ్ల శ్రీనివాసరావు, బొద్దాన లక్ష్మణ్‌, మధు, బంగార్రాజు, బేరి నారాయణతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:22:16+05:30 IST