గొట్లాంలో చోరీ
ABN , First Publish Date - 2023-05-25T23:58:27+05:30 IST
గొట్లాం గ్రామంలో గురువారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది.

బొండపల్లి: గొట్లాం గ్రామంలో గురువారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లోల్ల నర్సింహమూర్తి ఇంట్లోకి వేకువజామున గుర్తుతెలియని వ్యక్తి చొరబడి, అతని భార్య మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు తోపాటు బీరువాలోగల రూ.2,500ను అపహరించుకు పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని, ఇంటి పరిసర ప్రాంతంలో పరిశీలించి, చుట్టుపక్కలవారిని విచారించారు. గ్రామంలోని షాలోమే ఆసుపత్రి యజమాని ఇం ట్లో కూడా దొంగతనానికి ప్రయత్నించగా ఇంట్లోవారు అప్రమత్తం కావడంతో దొంగ ఉడాయించినట్లు పోలీసులు తెలిపారు. గజపతినగరం సీఐ లెంక అప్పలనాయుడు తోపాటు సీసీఎస్ సర్కిల్ సీఐ, క్లూస్ టీం సిబ్బంది ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.